మెగా కృష్ణా రెడ్డి తెలంగాణను దోచుకున్నారు

మెగా కృష్ణా రెడ్డి తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు YSRTP అధ్యక్షురాలు వైస్ షర్మిల. తెలంగాణలో 80 శాతం ప్రాజెక్టులను మెగా కృష్ణా రెడ్డి ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. మెగా కృష్ణా రెడ్డి తెలంగాణను దోచుకున్నారన్న ఆమె… ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ఆయన చోటు సంపాదించుకున్నారన్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా వాళ్లకు ప్రాజెక్టులు కట్టబెట్టడాన్ని ప్రశ్నించిన కేసీఆర్.. ఇప్పుడు వాళ్లకే ఎందుకు ప్రాజెక్టులు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు షర్మిల.

తెలంగాణ వచ్చింది మెగా కృష్ణా రెడ్డి కోసమేనా..? తెలంగాణను ఆయన చేతుల్లో పెడితేనే రాష్ట్రం ఇస్తామని ఏమైనా ఒప్పందం చేసుకున్నారా..? రాష్ట్రం మొత్తాన్ని మెగా కృష్ణా రెడ్డి చేతుల్లో పెట్టడం ద్వారా ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. మెగా కృష్ణా రెడ్డితో ఒప్పందం లేకపోతే.. కేసీఆర్ అన్ని ప్రాజెక్టులను ఆయనకే ఎందుకు ఇస్తున్నారని.. ఆయనపై ఎందుకు విచారణ జరపడం లేదని షర్మిల ప్రశ్నించారు. మెగా కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అందరూ దోస్తులేనన్నారు. అందుకే ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడటం లేదన్నారు. మెగా కృష్ణారెడ్డి మీద విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయనకు కట్టబెట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలన్నారు.

రాజశేఖర రెడ్డి అందరి మనిషన్న షర్మిల.. ప్రతి ఒక్కరిని తన మనిషి అనుకున్నారు. ఆయన అందర్నీ ఎంకరేజ్ చేశారు. మెగా కృష్ణారెడ్డిని ఒక్కడినే ఆయన ఎంకరేజ్ చేయలేదు. ఆయన ప్రోత్సాహంతో ఎంతో మంది బిజినెస్‌మెన్‌లు అయ్యారు. ఇప్పుడు దేశంలో కాంట్రాక్టులు చేస్తున్నవారంతా ఆయన ఎంకరేజ్ చేసినవాళ్లే అని షర్మిల అన్నారు.

SHARE