కవితను రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయాలనీ విజయశాంతి డిమాండ్

ఎమ్మెల్సీ కవితను రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయాలనీ విజయశాంతి డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి కార్య కర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు , నిరసనలు తెలుపుతూ ఆమెను పార్టీ నుండి సస్పన్డ్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. కవిత పేరు రావడంతో దేశ వ్యాప్తంగా తెలంగాణ పరువుపోయిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. లిక్కర్ స్కాంలో కవిత పేరు వినపడటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ కవితను రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయాలన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. కేసీఆర్ 5లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ను గద్దె దించాలని..రాష్ట్రం నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొట్టాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.

మరోపక్క తన ఇంట్లో దీక్ష చేస్తున్న బండి సంజయ్ మాట్లాడుతూ..లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం బయటపడుతుందనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని చెప్పారు. కవితకు లిక్కర్ స్కాంలో సంబంధం లేకపోతే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర తప్పకుండా కొనసాగుతుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 27న వరంగల్‌లో ప్రజా సంగ్రా యాత్ర ముగింపు సభ ఉంటుందన్నారు.

SHARE