రేవంత్ రెడ్డి ..నన్ను రెచ్చగొట్టొద్దు – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్

నన్ను రెచ్చగొట్టొద్దు రేవంత్ రెడ్డి అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న కాంగ్రెస్ పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెంకట్ రెడ్డి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం రేవంత్ రెడ్డి రాజగోపాల్ ఫై ఓ రేంజ్ లో విమర్శలు చేసారు. ‘కోమటిరెడ్డి బ్రాండ్’ అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ ఫై వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఆయన పేరు పెట్టి మాట్లాడాలి కానీ.. మీరు అని మాట్లాడటం సరికాదన్నారు. రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ లో చేరాడని.. రాజగోపాల్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి వెళ్తున్నారని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు రేవంత్ పుట్టలేదన్నారు. తనను రెచ్చగొట్టొద్దంటూ రేవంత్ ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సున్నితంగా హెచ్చరించారు .

రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఎపిసోడ్‌పై నో కామెంట్స్‌. ఆయన తన ఇష్టమున్న పార్టీలోకి వెళ్తారు. ఏది ఉన్నా రాజగోపాల్‌రెడ్డినే అడగండి. చాలా కుటుంబాల్లో వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారనే విషయం గుర్తించాలి. రాజగోపాల్‌ వ్యవహారంతో కాంగ్రెస్‌ అధిష్టానం సైతం తనతో ఎలాంటి చర్చలు జరపలేదు అని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీ మారతారా? అనే ప్రశ్నకు.. తాను మాత్రం కరడుగట్టిన కాంగ్రెస్‌ వాదినేనని.. ఉమ్మడి కుటుంబంగా పార్టీ ఆదేశాలానుసారం పని చేస్తానని చెప్పారు. రేవంత్ కామెంట్స్ తనను బాధించాయన్న ఆయన..రేవంత్ కామెంట్స్ పై ప్రజలు సైతం బాధపడుతున్నారు. వెంటనే రేవంత్ తన మాటలను వెనక్కు తీసుకోవాలని , తనకు క్షేమపణలు చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేసారు.

SHARE