‘నిన్నమొన్న పార్టీలోకి వచ్చి తమాషా చేస్తున్నడా…?’ రేవంత్ ఫై వెంకట్ రెడ్డి ఫైర్

కోమటిరెడ్డి రాజగోపాల్ మునుగోడు ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం తో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం తో ఊగిపోతున్నారు. మరో రెండు రోజుల్లో రాజగోపాల్ బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారు. దీంతో మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఎలాగైనా మరోసారి గెలిచి తీరాలని కాంగ్రెస్ సన్నాహాలు చేస్తుంది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ ..రాజగోపాల్ ఫై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎటాక్ చేస్తూ వస్తున్నారు.

తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ‘నిన్నమొన్న పార్టీలోకి వచ్చి తమాషా చేస్తున్నడా…?’ అంటూ రేవంత్ ఫై నిప్పులు చెరిగారు. తనను పార్టీలోంచి వెళ్లగొట్టేందుకు రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చండూరు సభలో రేవంత్‌రెడ్డి ఆయన అనుచరులతో కావాలనే తనను తిట్టించారని అన్నారు. అందుకు రేవంత్‌రెడ్డే స్వయంగా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వారు ఆశిస్తున్నట్లుగా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే నాలుగు పార్టీలు మారినవారు ఐదో పార్టీలోకీ వెళ్తారని.. తానుమాత్రం కాంగ్రెస్‌ను వీడబోనని పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

SHARE