హైదరాబాద్ లో మరో అత్యాచార ఘటన

హైదరాబాద్ నగరంలో వరుస అత్యాచార ఘటనలు తల్లిదండ్రులను , మహిళ యువతను ఖంగారు పెట్టిస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. మొన్నటి వరకు జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపగా …తాజాగా మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ పాతబస్తీలోని ఉప్పుగూడలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అలీ తన స్నేహితుడు అర్బాస్‌తో కలిసి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇందుకు సంబంధించి బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు అలీ, అర్బాస్‌లను అదుపులోకి తీసుకున్నారు.


ఈ కేసుకు సంబంధించి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే బాధిత బాలికకు నిందితుడు అలీ ముందే తెలుసని.. ఆమెతో ఉన్న స్నేహాన్ని అదునుగా తీసుకుని స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇలా వరుస అత్యాచార ఘటనలు నమోదు అవుతుండడంతో ప్రభుత్వం ఫై విమర్శలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా కామాంధులు రెచ్చిపోతున్నారని , డ్రగ్స్ , మద్యం మత్తులో ఇలా చెలరేగిపోతున్నారని , నగరంలో డ్రగ్స్ ను అదుపుచేయడం లో ప్రభుత్వం విఫలం అవుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి.

SHARE