టిఆర్ఎస్ ప్రభుత్వం పై కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింథియా సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన లో పాల్గొనేందుకు జ్యోతిరాదిత్య సింధియా గురువారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు రోజులపాటు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారుల మేధావులతో జ్యోతిరాధిత్యాసిందిగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా నేడు మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందన్నారు. తెలంగాణలో రోజు రోజుకు ప్రజల్లో బీజేపీ, మోదీ పట్ల ఆదరణ పెరుగుతోందన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలను చూస్తే గతంలో కార్పొరేటర్ల ఎన్నికల్లో కేవలం 4 శాతం మాత్రమే బీజేపీవి ఉండేవి. కానీ గత ఎన్నికల్లో 38 బీజేపీ గెలిచిందన్నారు. బీజేపీ, మోదీపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీరుగమనంలో ఉందని, అవినీతి తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని ఆరోపించారు. బిజెపి హయాంలోనే తెలంగాణకు అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు. అయినా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదని సింథియా మండిపడ్డారు.

SHARE