ముగిసిన ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు

దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిసాయి. జూబ్లీహిల్స్ లోని ఆమె ఇంటి నుంచి అంతిమయాత్రను ప్రారంభించారు. ఈ అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు , నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఆమె పాడెను సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు మోశారు. ఆమె చితికి భర్త శ్రీనివాస ప్రసాద్ నిప్పంటించారు. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, లోకేశ్ సహా కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం మధ్యాహ్నం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో తన తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు దీక్షిత తెలిపింది. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురిమే ఉన్నామని, లోపలి నుంచి గడియ పెట్టుకుందని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉమా మహేశ్వరి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నట్టు వివరించింది. భోజన సమయానికి బయటకు రాకపోవడంతో తలుపు తెరిచే ప్రయత్నం చేయగా లోపలి నుంచి గడియ పెట్టుకోవడం..ఎంత పిలిచిన డోర్ ఓపెన్ చేయకపోవడం తో..తలుపులు బద్దలు కొట్టడం తో ఉరి వేసుకొని ఉందని దీక్షిత తెలిపారు.

నందమూరి తారకరామారావుకు మొత్తం 12 మంది సంతానం. వారిలో ఎనిమిది మంది కుమారులు కాగా, నలుగురు కూతుళ్లు. వీళ్లలో ముగ్గురు కుమారులు చనిపోయారు. పెద్ద కుమారుడు రామకృష్ణ ఎన్టీయార్‌ బతికి ఉండగానే చనిపోగా.. మిగతా ఇద్దరు కుమారులు ఎన్టీయార్‌ స్వర్గస్థులైన తర్వాత చనిపోయారు. ఇప్పుడు ఆయన చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు దీంతో, ఎన్టీయార్‌ సంతానంలో ముగ్గురు కుమారులు, ఓ కూతురు మరణించారు. ఆయన 12 మంది సంతానంలో మొత్తం నలుగురు చనిపోయారు. దీంతో, ఇప్పుడు ఐదుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

SHARE