టీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్స్..

స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్బంగా టీఎస్ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. ఈమేరకు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జన్నార్​ ఆ వివరాలను వెల్లడించారు. ఆగస్టు15న జ‌న్మించే చిన్నారులంద‌రికి వారికి 12 ఏళ్లు వచ్చే వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న పెద్ద వయస్కులకు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించ‌వ‌చ్చ‌ని తెలిపింది. టీ24 బస్ టికెట్ ను ఆగస్టు 15న రూ.75కు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది. మాములు రోజుల్లో దీని రూ.120 కావటం గమనార్హం.

నేటి నుంచే అంటే మంగళవారం నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని అలపిస్తాం. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులంతా అమ్రతోత్సవ్ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాల్సి ఉంటుంద‌న్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ వంటి పెద్ద పెద్ద బస్ స్టేషన్లలో 32 మంది స్వాతంత్య్ర సమరయోధుల అనుభవాలను షార్ట్ ఫిల్మ్​లుగా రూపొందించి ఆగస్టు 15 నుంచి 20వరకు ప్రదర్శించనున్నారు.

SHARE