కేంద్రం GST బాదుడు ఫై టిఆర్ఎస్ పార్టీ ఆందోళన

పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే GST పేరుతో అన్ని వస్తువుల ఫై పన్ను విధించి సామాన్య ప్రజలను ఆర్ధికంగా దెబ్బ తీస్తున్న కేంద్రం..ఇప్పుడు నిత్యావసరాల ఫై కూడా GST పన్ను విధించి వారిపై పెను భారం మోపుతోంది.

ఒకే మార్కెట్‌.. ఒకే పన్ను పేరుతో కేంద్ర, రాష్ర్టాల పన్నులను ఏకం చేసి ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఇప్పుడు సామాన్యుల ఉసురు తీస్తున్నది. ఆఖరికి జబ్బు వచ్చి బాగుచేసుకునేందుకు దవాఖానకు చేరినా.. ఊపిరాగి చచ్చిపోయినా పన్నుల నుంచి మాత్రం తప్పించుకోలేని పరిస్థితికి కేంద్రం తీసుకొచ్చింది. హాస్పటల్ బెడ్డు దగ్గర్నుంచి పసిపాపలు తాగే పాల వరకు ఏది వదిలి పెట్టకుండా కేంద్రం పన్నులు వసూళ్లు చేస్తుంది. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబును కేంద్రం ఇలా పన్నుల పేరుతో దోచేస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 99 శాతం సేవలు, వస్తు ఉత్పత్తులపై జీఎస్టీ పడుతున్నదంటే అతిశయోక్తి కాదు. వీటిలో నిత్యావసరాలే ఎక్కువగా ఉండటం కలవరపెడుతున్నది.

పెరుగు, లస్సీ, బటర్‌మిల్‌ వంటి ప్రీప్యాక్డ్‌, ప్రీలేబుల్డ్‌ పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని విధించింది. అంతేగాక డెయిరీ మిలింగ్‌ మిషనరీపై జీఎస్టీని 12% నుంచి 18 శాతానికి పెంచారు. ఈ నిర్ణయాలతో పాలు, పెరుగు, లస్సీ, బటర్‌మిల్‌ వంటివాటి కోసం ప్రతి కుటుంబం కనీసం 10-15% అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పటికే పశువుల మేత దగ్గర్నుంచి అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఇలా కేంద్రం GST పన్నుల బాదుడు ఫై టీఆరఎస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. ఇప్పటికే కేంద్రంతో ఫైట్ చేస్తూ వస్తున్నా టీఆరఎస్ ..ఇప్పుడు GST బాదుడు ఫై నిరసనలు మొదలుపెట్టింది.

SHARE