కేసీఆర్ కాలి గోటికి కూడా ఈటల సరిపోడు – పాడి కౌశిక్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి vs టిఆర్ఎస్ మాటల యుద్ధం కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బిజెపి సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటి నుండే జనాల్లోకి వెళ్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈటలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కాలి గోటికి కూడా ఈటల సరిపోడని ఆయన అన్నారు. హుజూరాబాద్ లో ఈటలకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. కేసీఆర్ పై గెలుస్తాననే మాటలు పక్కన పెట్టాలని… సొంత నియోజకవర్గం హూజూరాబాద్ నుంచే పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. ఉప ఎన్నిక తర్వాత హుజూరాబాద్ లో కనీసం లక్ష రూపాయల అభివృద్ధి అయినా చేశారా? అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

అలాగే అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల రాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ జేజమ్మ దిగి వచ్చినా.. మీ మోడీ, అమిత్ షా వచ్చినా మా ప్రభుత్వాన్ని ఏమి చేయలేరని అన్నారు. అనామకుడు ఈటలను మంత్రి చేస్తే ఇట్లేనా మాట్లాడేదన్నారు. అసలు నిన్ను ఎవడన్నా లీడర్ గా గుర్తిస్తారా అంటూ కామెంట్ చేశారు. నీకు దమ్ముంటే ఒక్కరన్న మా వాళ్ళు టచ్ లో వుంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అదే నిజమైతే.. ఆధారాలు బయట పెట్టాలని బాలరాజు అన్నారు. తెలంగాణలో చిచ్చు పెడితే తగిన రీతిలో బుద్ది చెప్తామని ఆయన అన్నారు.

SHARE