మరిన్ని భూములు అమ్మేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధం

మరిన్ని ప్రభుత్వ భూములు అమ్మేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమైందా..అంటే అవుననే చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ అప్పుల్లో ఉంది. దీంతో సరైన టైంకు జీతాలు ఇవ్వలేక , పెన్షన్లు ఇవ్వలేక పోతుంది. ఇప్పుడు కొత్త పింఛన్ల కోసం ఏటా అదనంగా రూ.3,240 కోట్లు ప్రభుత్వానికి కావాలి. ఈ నెలలో రైతు బీమాకు రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. కల్యాణ లక్ష్మీ, దళిత బంధు, రైతు బంధు, ఇతర పథకాల అమలుకు రూ.వేల కోట్లు కావాలి. వీటికి తోడు ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ డిపార్ట్ మెంట్లకు రూ.వేల కోట్ల నిధులు అవసరం ఉంది. పైగా ఇప్పటికే రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశంలో నిధుల సేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. మళ్లీ అప్పు జోలికి వెళ్లకుండా ప్రభుత్వ భూములను అమ్మాలని నిర్ణయం తీసుకుంది.

ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలో భూములను అమ్మాలని చూస్తుంది. అధికారులు ఒక్క రంగారెడ్డి పరిధిలోనే 280 ఎకరాలు గుర్తించారు. ఇందులో బుద్వేల్, పేట్ బషీరాబాద్ ఏరియాలో ఎక్కువ భూములు ఉన్నాయి. ఇక సంగారెడ్డి పరిధిలో 185 ఎకరాలు, హైదరాబాద్ పరిధిలో 35 ఎకరాలు వేలం వేయనున్నారు. ఈ భూములన్నీ ఎలాంటి లిటిగేషన్ లేకుండా ఉన్నాయి. వీటిని ఒకేసారి కాకుండా 4 నెలల్లో 4 విడతల్లో అమ్మాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో విడతలో 120 ఎకరాల నుంచి 150 ఎకరాలు అమ్మాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇలా అమ్మిన భూములతో రాష్ట్ర ఖజానా నింపుకోవాలని ప్లాన్ చేస్తుంది.

SHARE