గవర్నర్ తమిళిసై ఢిల్లీ టూర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి నడుస్తున్న టైములో గవర్నర్ తమిళిసై ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం హస్తినకు వెళ్లినట్లు చెబుతున్నా ఆమె.. పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూ డా భేటీ అవుతారన్న టాక్. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, రాజాసింగ్ వ్యవహారం, బండి సంజయ్ పాదయత్ర నిలిపివేత వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది

మరోవైపు ఎంపీ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని బీజేపీ నేతలు మంగళవారం గవర్నర్ తమిళిసైను కలిశారు. ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడం, బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకుని గృహనిర్బంధం చేయడానికి దారితీసిన పరిస్థితులు, బీజేపీ కార్యకర్తలపై దాడులు వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్‌కు బీజేపీ బృందం విజ్ఞప్తి చేసింది. బండి సంజయ్‌ పాదయాత్రను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చి, తగిన భద్రత కల్పించేలా డీజీపీని ఆదేశించాలని కోరింది. మరి ఇదేమైనా కేంద్ర మంత్రి తో గవర్నర్ మాట్లాడతారా లేదా అనేది చూడాలి.

SHARE