హైదరాబాద్ లో అతివేగం ఇద్దరి యువకుల ప్రాణాలు తీసింది

అతివేగంతో వాహనాలు నడపడకూడదని ఎంత చెప్పిన కొంతమంది వారి తీరు మార్చుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బైక్ ల ఫై వెళ్లే వారు ఈ ప్రమాదాలకు గురి అవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇదే జరిగింది. అతివేగంతో బైక్ నడుపుతూ మెట్రో పిల్లర్ కు తగిలి ప్రాణాలు విడిచారు.

వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులు మోహిన్ (23), ఒబేద్ (22) బైక్‌పై ఖైరతాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సోమాజీగూడ హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్న మెట్రోపిల్లర్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులిద్దరూ నగరంలోని వారి బంధువుల ఇంటికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మొదలుపెట్టారు.

SHARE