ప్రశాంతంగా ముగిసిన ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష

రాష్ట్ర పోలీసు నియామక బోర్డు అధ్వర్యంలో ఆదివారం జరిగిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 554 పోస్టులకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించింది. పరీక్షకు పోలీస్‌శాఖ పకడ్బందీ ఏర్పాటు చేసింది.

ఉదయం నుంచి 9 గంటల నుంచి హాల్‌టికెట్లు, ఐడీ కార్డుల పరిశీలించి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా 538 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగ్గా.. 91.32శాతం అభ్యర్థులు హాజరయ్యారు. 2,25,759 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. మొత్తం 2,47,217 మంది దరఖాస్తు
చేసుకున్నారు.

ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించే మార్కులను తొలిసారిగా కుదించారు. గత పరీక్షల్లో సామాజిక వర్గాలవారీగా మార్కులుండేవి. ఈసారి సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30శాతం మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో అబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలున్నాయి. వీటిలో 30 శాతం మార్కులు సాధిస్తే పరీక్ష గట్టెక్కినట్లే… అంటే 60 ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించగలిగితే చాలు అర్హత సాధించినట్లే.

SHARE