రేపు వరద బాధిత ప్రాంతాల్లో వైస్ షర్మిల పర్యటన

రేపు వరద బాధిత ప్రాంతాల్లో YSRTP అధ్యక్షురాలు వైస్ షర్మిల పర్యటించబోతున్నారు. దీనికి సంబదించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు పార్టీ నేతలు. మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.

దీనికి సంబదించిన షెడ్యూల్ చూస్తే.. రేపు (జులై 21) ఉదయం 7.30 గంటలకు లోటస్ పాండ్ నుంచి షర్మిల బయలుదేరనున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో మొదటి రోజు పర్యటన కొనసాగనుంది. శామిర్ పేట, సిద్ధిపేట, చొప్పదండి, ధర్మారం, వెలగతూర్, రాయపట్నం, ధర్మపురి, ఇందెనపల్లి, జిన్నారం మీదుగా ఉదయం 11.00 గంటలకు కోయపోశయ్య గూడెంకు చేరుకుంటారు. అక్కడ పోడు రైతులతో షర్మిల మాట్లాడనున్నారు. అనంతరం 1.00 గంటకు భోజన విరామం తీసుకుంటారు. మూడు గంటలకు దండెపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన భోజన శిబిరాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4.00 గంటలకు మంచిర్యాల పట్టణానికి చేరుకున్న అనంతరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. దండెపల్లి, లక్సెటిపేట, హాజీపూర్ ల మీదుగా షర్మిల రానున్నారు. సాయంత్రం 6.00 గంటలకు రామగుండం పట్టణానికి చేరుకుని అక్కడే షర్మిల విశ్రాంతి తీసుకుంటారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా గోదావరి నదికి వచ్చిన వరదలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. పలు ప్రాజెక్ట్ లు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికీ చాలా మంది ప్రజలు గోదావరి ముంపు నుంచి బయటపడలేదు.

SHARE