ఆగస్టు 08 న కొడంగల్ లో షర్మిల భారీ బహిరంగ సభ

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఈ నెల 08 న కొడంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం షర్మిల తన ప్రజాప్రస్థాన పాదయాత్ర కు బ్రేక్ ఇవ్వగా .. ఈనెల 8 నుంచి పాదయాత్ర ను పునఃప్రారభించబోతున్నారు. 8న కొడంగల్ లో భారీ సభ నిర్వహించి..యాత్ర స్టార్ట్ చేస్తారని పాదయాత్ర కో ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మొత్తం 14 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే షర్మిల ఉమ్మడి ఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మం జిల్లా, ఉమ్మడి న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్గొండ జిల్లాల్లో యాత్ర ముగించుకున్నారు. ఇక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పాలమూరు లో ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యటించి ప్రజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ష్టాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెలుసుకోనున్నారు.

SHARE