రేవంత్ ..కేటీఆర్ లపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

YSRTP అధ్యక్షురాలు వైస్ షర్మిల..రేవంత్ రెడ్డి , కేటీఆర్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ఈరోజు కొండగల్ నియోజకవర్గంలో తన పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు ఓడించి ముఖం చెల్లకుండా చేశారని .. అలాంటి ముఖం చెల్లని వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి రాష్ట్ర అధ్యక్షుడ్ని చేసిందని విమర్శించారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారని, కొడంగల్ లో గెలవని వ్యక్తి, రాష్ట్రంలో పార్టీని గెలిపిస్తారా? అని ఎద్దేవా చేశారు.

కొడంగల్ ను ఒక దొంగ నుంచి కాపాడుకుంటే మరో దొంగ చేతిలోకి పోయిందని షర్మిల అన్నారు. ఇప్పుడున్న దొంగ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అన్నారు. అక్రమాలు, లాండ్ సెటిల్ మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకోవడం తప్ప, ప్రజలకు చేసిందేమీలేదని ఆరోపించారు. సిద్ధిపేట హరీశ్ రావు వచ్చి బంగారు కొడంగల్ చేస్తామని అన్నారు. అయిందా బంగారు కొడంగల్? పక్కనే కోస్గీకి బస్ డిపో ఇస్తామన్నారు… ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇక కేటీఆర్ గారు… చిన్నదొర… ఏంచెప్పాడు? ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కొడంగల్ ను దత్తత తీసుకుంటా, మరో సిరిసిల్లలాగా తయారు చేస్తా అన్నాడు. మరి దత్తత తీసుకున్నాడా, ఒక్క అభివృద్ధి పనైనా చేశాడా? చిన్నదొర కాలికి దెబ్బ తగిలితే మెదడు పనిచేయడంలేదు… ఒక్కమాట కూడా గుర్తుండడంలేదు… అదీ ఈ రోజు కొడంగల్ పరిస్థితి” అంటూ షర్మిల విమర్శించారు.

SHARE