వ‌ర‌ద బాధితుల‌కు ఎమ్మెల్యే సీత‌క్క నిత్యావసరాల స‌హాయం..

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వ‌ర‌ద బాధితుల‌కు నిత్యావసరాలు పంపిణి చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. దీంతో వందలాది మంది ముంపుకు గురై సర్వసం కోల్పోయారు. ఈ క్రమంలో వారికీ తనవంతు సాయం చేస్తున్నారు సీతక్క.

వ‌ర‌ద బాధితుల స‌హాయం కోసం వివిధ సంస్థ‌ల నుంచి నిత్యావ‌స‌రాలు సేక‌రించిన సీత‌క్క… ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో క‌లిసి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌కు వెళ్లారు. వ‌ర‌ద బాధితుల‌కు తన వెంట తీసుకెళ్లిన దుప్ప‌ట్లు, నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సీత‌క్క… దానికి సుదీర్ఘ కామెంట్‌ను కూడా జ‌త చేశారు. మీరెంత స‌హాయం చేసినా సంతృప్తి క‌ల‌గ‌క‌పోవ‌చ్చు కానీ… ఏ స‌హాయం చేయ‌కుంటే మాత్రం సంతృప్తి అన్న‌దే ద‌క్క‌దు అంటూ ఆమె పేర్కొన్నారు. త‌న పిలుపున‌కు స్పందించి వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చిన ఆయా సంస్థ‌ల‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

SHARE