బియ్యం రేటు భారీగా పెరిగాయి

బియ్యం ధరలు ఆకాశానికి తాకాయి. ఒక్కసారిగా 25 కేజీల బ్యాగ్ ఫై ఏకంగా రూ. 150 నుండి 200 వరకు పెరిగింది. రెండు రోజుల క్రితం వరకు సోనా మసూరి క్వింటాల్ రైస్ బ్యాగ్ 3 వేల 700 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 4వేల 500కు పెరిగింది. తాజాగా కేంద్రం GST పన్ను పెంచడంతో మార్కెట్ లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. HMT, ఆర్ఆర్, బుల్లెట్ రకాలు క్వింటాల్ రైస్ బ్యాగ్ 4 వేల రూపాయలు ఉండేవి. ప్రస్తుతం 5 వేలకు చేరింది. కర్నూల్ రైస్ 3 వేల 300 ఉంటే…. ఇప్పుడు 4 వేల 200 కు పెరిగింది. పెరిగిన ఈ ధరలు చూసి సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. ధరలు ఇలా పెరిగితే బతకడం కష్టమవుతోందని చెప్తున్నారు. మార్కెట్ లో ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే GST పేరుతో అన్ని వస్తువుల ఫై పన్ను విధించి సామాన్య ప్రజలను ఆర్ధికంగా దెబ్బ తీస్తున్న కేంద్రం..ఇప్పుడు నిత్యావసరాల ఫై కూడా GST పన్ను విధించి వారిపై పెను భారం మోపుతోంది. ఒకే మార్కెట్‌.. ఒకే పన్ను పేరుతో కేంద్ర, రాష్ర్టాల పన్నులను ఏకం చేసి ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఇప్పుడు సామాన్యుల ఉసురు తీస్తున్నది. ఆఖరికి జబ్బు వచ్చి బాగుచేసుకునేందుకు దవాఖానకు చేరినా.. ఊపిరాగి చచ్చిపోయినా పన్నుల నుంచి మాత్రం తప్పించుకోలేని పరిస్థితికి కేంద్రం తీసుకొచ్చింది. హాస్పటల్ బెడ్డు దగ్గర్నుంచి పసిపాపలు తాగే పాల వరకు ఏది వదిలి పెట్టకుండా కేంద్రం పన్నులు వసూళ్లు చేస్తుంది. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబును కేంద్రం ఇలా పన్నుల పేరుతో దోచేస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 99 శాతం సేవలు, వస్తు ఉత్పత్తులపై జీఎస్టీ పడుతున్నదంటే అతిశయోక్తి కాదు. వీటిలో నిత్యావసరాలే ఎక్కువగా ఉండటం కలవరపెడుతున్నది.

SHARE