ఈ నెల 07 న బిజెపిలోకి రాజగోపాల్ రెడ్డి..?

కాంగ్రెస్ పార్టీ కి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 07 బిజెపి కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తుంది. జెపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలోని జాతీయ కార్యాలయంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ఛాన్స్‌ ఉందని సమాచారం. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి తరఫున మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలో ఉండనున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటె కాంగ్రెస్ పార్టీ లో కొత్త లొల్లి మొదలైంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన అనంతరం రేవంత్ రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, తనను రెచ్చగొట్టొద్దని ఆయన హెచ్చరించారు. ‘‘మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయంలో ‘మీరు’ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి. పీసీసీ చీఫ్​ ఇలా మాట్లాడడం తప్పు. మీరు, మీరు అంటే కోమటి రెడ్డి బ్రదర్స్ ను అన్నట్లా? వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ నిజాయితీగా ఉన్న వాళ్లే. కోమటిరెడ్డి బ్రాండ్ ను బ్రాందీ షాపు అని ఎట్లంటవ్​? ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని వెంకట్​రెడ్డి అన్నారు. ఇక వెంకట్​రెడ్డి చేసిన వ్యాఖ్యల బట్టి చూస్తే ఈయన కూడా బిజెపి చేరే అవకాశాలు ఉన్నాయని పలువురు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొత్తం మీద రాజగోపాల్ రాజీనామా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి ఇబ్బందిగా మారింది.

SHARE