రెండేళ్ల తర్వాత పట్టాలెక్కిన పుష్పుల్ రైలు

కరోనా కారణంగా రెండేళ్లుగా పట్టాలెక్కని..పుష్పుల్ రైలు మళ్లీ ఈరోజు నుండి పట్టాలెక్కింది. వరంగల్ రైల్వే స్టేషన్ లో సోమవారం స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ జెండా ఊపి పుష్పుల్ రైలు సేవలను ప్రారంభించారు. 2020 మార్చి లో కరోనా కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించడంతో చాల రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఈ క్రమంలోరెండేళ్ల తర్వాత పుష్పుల్ రైలు ఈరోజు నుండి కూతపెట్టడం మొదలుపెట్టింది.

ప్రతి రోజు ఉదయం 5:15 గంటలకు పుష్పుల్ ట్రైన్ వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. స్టేషన్ ఘన్ పూర్, జనగామ, ఆలేరు, భువనగిరి, బీబీనగర్, మౌలాలి స్టేషన్ల గుండా ఉదయం 8:45 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. మళ్లీ సికిద్రాబాద్ నుంచి ఉదయం 9:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు వరంగల్ కు చేరుకుంటుంది. తిరిగి వరంగల్ లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటల వరకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి వరంగల్ లో హాల్ట్ అవుతుంది. మొత్తం 14 స్టేషన్ల గుండా రోజుకు 720 కిలోమీటర్ల దూరం వరకు పుష్పుల్ ట్రైన్ పయనిస్తుంది.

SHARE