స్కూల్ పిల్లలపై ప్రిన్సిపాల్ కుమారుడి లైంగిక దాడి..

హైదరాబాద్ లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అత్యాచారాలకు , డ్రగ్స్ కు హైదరాబాద్ కేరాఫ్ గా మారిపోయిందనే విమర్శలు వస్తుండగా..దీనిపై ప్రభుత్వం పోలీసులపై సీరియస్ గా ఉంది. హైదరాబాద్ లో ఇవన్నీ పూర్తిగా తగ్గించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో మరో దారుణం బయటకొచ్చింది.

స్కూల్ పిల్లలపై ప్రిన్సిపాల్ కుమారుడి లైంగిక దాడికి పాల్పడిన ఘటన మొయిన్ బాగ్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చోటుచేసుకుంది. స్కూల్ లోనే ప్రిన్సిపాల్ నివాసం ఉండడం తో అతడి కొడుకు యాసర్ ఆడపిల్లల ఫై లైంగిక దాడికి పాల్పడ్డాడు. న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి బెదిరింపులు దిగిన యాసర్‌, పలువురు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి ప్రిన్సిపాల్ కావటంతో ఆసరగా చేసుకుని స్కూల్ పిల్లల పై అఘాయిత్యం చేశాడు. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు తో వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన. గత కొంతకాలంగా చాలా మంది చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించిన పోలీసులు.. యాసర్ ఫై సెక్షన్ 354(a), 509, 9(m) r/w pocso act 2012 కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

SHARE