అగస్ట్ 2 నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర

ఆగస్టు 2వ తేదీ నుండి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టబోతున్నారు. ఇప్పటికే రెండు దఫాలు ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించిన బండి సంజయ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. ఇదే సమయంలో పార్టీ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని ఇస్తూ బండి సంజయ్ తన పాదయాత్రను కొనసాగించారు. ఇప్పుడు మరోమారు పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆగస్టు 02 నుండి యాదగిరి గుట్ట నుంచి వరంగల్ భద్రకాళి దేవస్థానం వరకు ఈ పాదయాత్ర ఉంటుందని బీజేపీ నేతలు తెలిపారు.

రీసెంట్ గా బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమై పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్ పై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వర్చువల్ గా పాల్గొన్నారు. ఇక ఆగస్ట్ 2 న యాదగిరి గుట్ట లో బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ బహిరంగ సభకు జాతీయ స్థాయిలోని ముఖ్య నేతలను పిలవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇక మూడవ విడతలో 26 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టనున్నారు. బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏప్రిల్ 14న ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుండి ప్రారంభమై మే 14న తుక్కుగూడ లో బహిరంగ సభ ను నిర్వహించడం ద్వారా ముగిసింది. ఇక గతేడాది బండి సంజయ్ మొదటి విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగింది.

SHARE