కేసీఆర్ ఫై నిప్పులు చెరిగిన పొన్నాల

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అనుభవరాహిత్యం, అహంకారం తోడైన వ్యక్తి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రాజెక్టులు కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్లు పండించాయని ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లతో ప్రయోజనం ఉందని నిరుపిస్తారా? అని పొన్నాల ప్రశ్నించారు. చరిత్రలో నిరుపయోగమైన ప్రాజెక్టు కట్టిన చరిత్ర కేసీఆర్‌దేనని దుయ్యబట్టారు.

మల్లన్నసాగర్లో 50 టీఎంసీలు నింపే దమ్ము కేసీఆర్‌కి ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నీటి కోసం పోరాటం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులకు, టీఆర్ఎస్ ప్రాజెక్టులకు ఎంతో తేడా ఉందని పొన్నాల అన్నారు. డిజైన్ లోపం బయటపడుతుందనే ప్రాజెక్టుల దగ్గరికి ఎవర్నీ పోనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల దగ్గర తామేమైనా బాంబులు పెడుతామా? అంటూ నిలదీశారు. ఎవర్నీ అడిగి కేసీఆర్ ప్రాజెక్టులు కడుతున్నారన్నారు.

SHARE