వరద బాధితులకు పొంగులేటి రూ.కోటి విలువ చేసే సరుకులను అందజేశారు

భద్రాచలంలో గోదావరి వరద ఉదృతికి ముంపు గ్రామాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఎంతోమంది రోడ్డున పడ్డారు. ఇప్పటికి పలు గ్రామాలు నీటిలోఉన్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ సాయం అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరద బాధితులకురూ.కోటి విలువ చేసే సరుకులను 15 వేల మందికి అందజేశారు. భద్రాచలం టౌన్​లోని పునరావాస కేంద్రాల్లో టీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్​ పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆకలితో అలమటిస్తున్న వారి కష్టం కలచి వేసిందని అన్నారు. తనవంతు సాయంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు.

బూర్గంపహడ్: గోదావరి వరదలతో నష్టపోయిన వరద బాధితులకు అండగా ఉంటానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. బూర్గంపహడ్ తో పాటు మండలంలోని రెడ్డిపాలెం, సారపాకలలో వరద బాధితులను పరామర్శించి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బోటు ప్రమాదంలో 9 మందిని కాపాడిన పిట్టల రమేశ్​ను సన్మానించి రూ.5 వేలు అందించారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో గోదావరి వరదలు తీరని విషాదం నింపాయని చెప్పారు. జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.తెల్లం వెంకట్రావ్, డీసీసీబీ డైరక్టర్​ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్​ పిడమర్తి రవి, కడియం రామాచారి పాల్గొన్నారు.

SHARE