కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవర్ స్టార్ పవన్

టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ విసిరినా ఛాలెంజ్ ను సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వీకరించారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత బట్టలు ధరించిన ఫోటోలు వీడియోలు పోస్ట్ చేయాలని మంత్రి కేటీఆర్ పవన్ కళ్యాణ్, ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా, సచిన్ టెండుల్కర్ లకు ఛాలెంజ్ విసిరారు.

దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్.. రామ్ భాయ్.. మీ ఛాలెంజ్ ను స్వీకరించా అని చేనేత వస్త్రాలు వేసుకున్న ఫోటోలను పోస్ట్ చేశారు. పవన్ ఛాలెంజ్ పై స్పందించిన కేటీఆర్ కూడా ఓకే అన్నా అని పవన్ ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్ కళ్యాణ్ మరో ముగ్గురికి చేనేత ఛాలెంజ్ విసిరారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ లకు సవాల్ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫోటోలు పోస్ట్ చేయాలని కోరారు.

SHARE