తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలు

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమిస్తూ సుప్రీం కోర్ట్ కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇందులో నలుగురిని జడ్జిలుగా, ఇద్దరిని అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

కొత్త నాయమూర్తుల నియామకాన్ని ధ్రువీకరిస్తూ శుక్రవారం కేంద్ర న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, నగేశ్‌ భీమపాక, పుల్లా కార్తీక్‌, కాజా శరత్‌ను న్యాయమూర్తులుగా, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావును అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి రాజేందర్‌ కశ్యప్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు.

జడ్జిలుగా నియమితులైనవారిలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నాగేశ్ భీమపాక, పుల్లా కార్తీక్ అలియాస్ పి ఎలమందర్, కాజ శరత్ ఉన్నారు. అడ్వకేట్ కోటా నుంచి పదోన్నతి కల్పించాలని వీళ్ల పేర్లను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర హైకోర్టు జడ్జిల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచారు. ప్రస్తుతం 27 మంది జడ్జిలుండగా తాజా నియామకంతో జడ్జిల సంఖ్య 33కు చేరనుంది.

SHARE