ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఫై హత్యాయత్నం

టిఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యాయత్నం జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 12లోని వేమూరీ ఎన్ క్లేవ్‌లోని జీవన్‌రెడ్డి ఇంట్లోకి మక్లూర్‌ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్‌ భర్త ప్రసాద్ చొరబడి ఆయన్ను హత్య చేసేందుకు ట్రై చేసాడు. కానీ జీవన్ రెడ్డి అలర్ట్ కావడం తో పెను ప్రమాదం తప్పింది. తన బెడ్ రూమ్ లోకి చొరపడ్డ వ్యక్తిని చూసి గట్టిగా అరవడం తో ప్రసాద్ పారిపోయాడు.

ఈ క్రమంలో జీవన్ రెడ్డి సిబ్బంది ఆయన్ను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ప్రసాద్ గౌడ్ ను విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భార్య లావణ్యను సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ చేయడంతో ఆమె భర్త ప్రసాద్‌ గౌడ్‌ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తుంది.

SHARE