అక్టోబర్ లో మునుగోడు ఉపఎన్నిక..?

మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తో ఇక అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ లో ఈ ఉప ఎన్నిక జరగనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన రాజగోపాల్..బిజెపి లో చేరేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. బిజెపి నుండి మునుగోడు నుండి పోటీ చేయబోతున్నట్లు వినికిడి. ఇక టిఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లేదంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు ను గని బరిలోకి దించే ఆలోచన చేస్తుది. కాంగ్రెస్ పార్టీ సైతం ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. హుజూరాబాద్ తరహాలో తప్పులు చేయకుండా ముందుగానే అభ్యర్థిని ప్రకటించాలని ఆలోచన చేస్తోంది.

ఇదిలా ఉంటె రేవంత్ రెడ్డి ఫై రాజగోపాల్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తనది కాంగ్రెస్ రక్తం కాదని, అవకాశ రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి వెనుక ఉన్నది చంద్రబాబు, సీమాంధ్ర పెట్టుబడి దారులని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అసలే గెలవదన్న ఆయన… ఆత్మ గౌరవమున్న తనలాంటి నాయకులు పార్టీ నుంచి బయటికి పోతన్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి లాంటి చిల్లర వ్యక్తుల ఆధ్వర్యంలో పనిచేసేదిలేదని స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు… మోడీ, అమిత్ షా నాయకత్వంలో పని చేయనున్నట్లు స్పష్టం చేశారు.

SHARE