ACB కి చిక్కిన అవినీతి తిమింగలం..

జనగామ జిల్లా స్టేషన్ ఘణపురంలో ACB ఓ ప్రభుత్వ అవినీతి తిమింగలం చిక్కింది. జనగామ జిల్లా స్టేషన్ ఘణపురం ఎంపీడీవో కుమారస్వామి రూ.1.40 లక్షలు నగదు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామపంచాయతీ కార్యదర్శి కిషోర్ ను ఎంపీడీవో దేశగాని కుమారస్వామి ఓ పని విషయంలో భారీగా డబ్బు డిమాండ్ చేశాడు. కిషోర్ గతంలో స్టేషన్ ఘణపురం మండలం శివునిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేశాడు.

డబ్బులు ఇస్తేనే పనిచేస్తానని ఎంపీడీవో కుమారస్వామి తేల్చి చెప్పడంతో పంచాయతీ కార్యదర్శి కిషోర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన ప్రకారం హనుమకొండలోని ఎన్జీవోస్ కాలనీ రోడ్ లో సుమంగళి ఫంక్షన్ హాల్ సమీపంలో గల ఎంపీడీవో కుమారస్వామి ఇంటి వద్దకు చేరుకున్నాడు కిషోర్. అప్పటికే పథకం ప్రకారం సమీపంలో ఉన్న ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శి కిషోర్ ఎంపీడీవో ఇంట్లో రూ.1.40 లక్షలు నగదు లంచంగా ఇస్తుండగా పుచ్చుకున్న కుమారస్వామిని పట్టుకున్నారు. అనంతరం ఎంపీడీవో కుమార స్వామిని అదుపులోకి తీసుకున్నారు.

SHARE