మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం టిఆర్ఎస్ పార్టీదే – ఎమ్మెల్సీ కవిత

మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం మాత్రం టిఆర్ఎస్ పార్టీదే అని ధీమా వ్యక్తం చేసారు ఎమ్మెల్సీ కవిత. మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పిన ఆయన బీజేపీలో చేరబోతున్నారు. కోమటిరెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది.

దేశ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్ లో వన మహోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా… టీఆర్ఎస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా… అభివృద్ధి ఆగలేదని అన్నారు.

బీజేపీ బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తుందని కవిత విమర్శించారు. బీహార్ లో జరుగుతున్న రాజకీయాలను అందరూ గమనిస్తున్నారని అన్నారు.

SHARE