ఎమ్మెల్యే రాజాసింగ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఫైర్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఫైర్ అయ్యారు. ఖబర్దార్.. రాజాసింగ్ అని హెచ్చరించారు. ‘‘మునావర్ ఫారుఖీ ఇండియన్ కాదా ? పాకిస్థాన్ వాడా ? మునావర్ ముంబైలోనే ఉంటాడు. ఆయన ప్రాపర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే. మరి మీ ముఖ్యమంత్రులు ఏం పీకుతున్నారు ?’’ అని ఎమ్మెల్యే షకీల్ ప్రశ్నించారు. తెలంగాణను ఒక గోద్రాలా మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా మాట్లాడారనే ఆరోపణలతో రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎంఐఎం నేతలు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం ఉదయం రాజాసింగ్ నివాసానికి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజాసింగ్ ఇంటి పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు.

SHARE