దేశాన్ని దోచుకుంటున్న వాళ్ల పట్ల ఈడీ కళ్ళు మూసుకున్నాయి – సీతక్క

సోనియా ఈడీ విచారణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని గాంధీ భవన్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్ష లో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బిజెపి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈడీ బీజేపీ అనుబంధ సంస్థ లాగే పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులపైనే ఈడీ కన్ను అని..దేశాన్ని దోచుకుంటున్న వాళ్ల పట్ల కళ్ళు మూసుకుందని మండిపడ్డారు. బ్రిటీష్ వాళ్ళు ఇండియాని దోచుకుంటున్నట్టు ఇప్పుడు కొందరు దోచుకుంటున్నారన్న సీతక్క..ప్రతి వస్తువుపై గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమతో కలుపుకొని ప్రభుత్వాలని ఏర్పాటు చేయడం దుర్మార్గమని విమర్శించారు. రాహుల్, సోనియాలపై ఈడీ విచారణ కుట్ర పూరితమన్నారు. మోడీ దుబారా ఖర్చులపై సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు ఎందుకు కళ్లు మూసుకుంటున్నాయని ప్రశ్నించారు.

SHARE