బైక్ ను ఢీ కొట్టిన ఎమ్మెల్యే రాములు నాయక్ కారు

మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా, రఘునాధపాలెం మండలం, మంచుకొండ దగ్గర ఎమ్మెల్యే రాములు నాయక్ కారు ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం నుండి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి కారేపల్లి వెళ్తున్న ఎమ్మెల్యే రాములు నాయక్ మంచుకొండ దగ్గర ఆయన కారు బైకును ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన యువకులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే దగ్గరుండి యువకులను ఆటోలో హాస్పిటల్ కి తరలించారు. యువకుల బైకుతో పాటు.. ఎమ్మెల్యే కారు కూడా దెబ్బతినడంతో రాములు నాయక్ మరో కారులో అక్కడి నుంచి బయలు దేరినట్లు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే డ్రైవర్ అదుపు తప్పాడా.. లేక బైక్ నడుపుతున్న వ్యక్తి రాంగ్ రూట్ లో వచ్చాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

SHARE