ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా మాట్లాడారనే ఆరోపణలతో రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎంఐఎం నేతలు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం ఉదయం రాజాసింగ్ నివాసానికి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజాసింగ్ ఇంటి పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు.

ఇక బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ ల అరెస్ట్ ను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బండి సంజయ్ అరెస్ట్ ను ఆమె ఖండించారు. అక్రమ కేసులు, అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను టీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్నందుకే తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు.

SHARE