టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి చేదు అనుభవం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. భూదన్ పోచంపల్లి మండలం దేశముఖ్ గ్రామంలో పైళ్ల శేఖర్ రెడ్డి పర్యటిస్తుండగా..గ్రామస్థులు నిలదీశారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. రహదారి పనులను ఎందుకు పూర్తి చేయలేదని ఎమ్మెల్యేపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్లు సరిగా లేకపోవడంతో స్కూలు బస్సు గ్రామంలోకి రాక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారంతా వాపోయారు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమస్యలను పరిష్కరిస్తామని , రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు.

SHARE