తెలంగాణ బతుకమ్మ జోలికి వస్తే..మీ ఇళ్లపై దాడులు చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరిక

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణల నేపథ్యంలో నిన్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బిజెపి కార్యకర్తలు ఆందోళలన చేయడం ఫై టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బతుకమ్మ జోలికి వస్తే బీజేపీ బతుకులు ఆగం అవుతాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించడాన్ని ఆయన ఖండించారు.

టీఆర్ఎస్ దాడులకు పాల్పడితే బీజేపీ తట్టుకుంటుందా అని ప్రశ్నించారు. బీజేపీ తీరు మార్చుకోకుంటే రానున్న రోజుల్లో తాము కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఇళ్లపై దాడులు చేయాల్సి వస్తదని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబంలో నేతలంతా ప్రజల్లోంచి వచ్చారని..లిక్కర్ స్కాం కేసులో ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని కవిత ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ 8 ఏళ్ల కాలంలో 22వేలకు పైగా ఈడీ, ఐటి కేసులు నమోదు అయ్యాయని..స్వాతంత్య్రం వచ్చిన్నప్పటి నుంచి జరగని ఈడీ సోదాలు మోడీ పాలనలో జరుగుతున్నాయన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను చీల్చడానికే కేంద్రం ఈడీ, ఐటి, సీబీఐ లను వాడుతోందన్నారు.

SHARE