జేపీ నడ్డాతో క్రికెటర్ మిథాలి రాజ్ భేటీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా తో భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నడ్డాకు పుష్గగుచ్ఛం అందించారు. ప్రస్తుతం తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రాజకీయ నాయకులనే కాకుండా సినీ స్టార్స్ తో పాటు క్రీడాకారులపై కూడా ఫోకస్ పెట్టింది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. స్టార్ హీరో ఎన్టీఆర్ తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

ఈరోజు సాయంత్రం హీరో నితిన్ తో నడ్డా భేటీ కాబోతున్నారు. ఇదిలా ఉండగానే వరంగల్ పర్యటన కోసం వచ్చిన నడ్డాతో మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఈరోజు వరంగల్ లోని హనుమకొండ లో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు జేపీ నడ్డా హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు, రచయితలు, అలాగే క్రీడాకారులతో సమావేశం కానున్నారు.

SHARE