ప్రజలకు అనుకూలంగా ఉన్న పార్టీని గెలిపించాలని మునుగోడు ప్రజలకు మావోయిస్టులు లేఖ

మునుగోడు మ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీ లు ఉప ఎన్నిక ఫై ఫోకస్ చేసాయి. బిజెపి తీరం పుచ్చుకున్న రాజగోపాల్..ఇప్పటికే తన ప్రచారాన్ని మొదలుపెట్టి..టిఆర్ఎస్ ఫై విరుచుకుపడుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ సైతం ప్రచారానికి సిద్దమవుతుంది. ఈ తరుణంలో మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ బయటకు వచ్చింది. అధికారం కోసం బిజెపి మతాల మధ్య చిచ్చు పెడుతోందని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు. వ్యాపారం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిజెపి అవసరమైందన్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు ముస్లింలను అవమానించేలా ఉన్నాయని లేఖలో వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ లంచగొండి కుటుంబ పాలన వల్లే తెలంగాణలో బిజెపి ముందుకు వచ్చిందని మావోయిస్టు నేత జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రజా వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పీడన వ్యవస్థలను నిర్మూలించాలని సూచించారు. కాబట్టి ప్రజలకు అనుకూలంగా ఉన్న పార్టీని గెలిపించాలని లేఖలో కోరారు.

SHARE