మునుగోడు లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ కు సన్నాహాలు ..

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..మునుగోడు ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడంతో మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే మునుగోడు ఫై ఫోకస్ పెట్టింది. రాజగోపాల్ రాజీనామా చేయడం..బిజెపి లో చేరబోతుండడం తో..కాంగ్రెస్ పార్టీ మునుగోడు లో భారీ బహిరంగ సభ పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఈ క్రమంలో శుక్రవారం భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. చండూర్ మండలంలో జరిగే సభకు పీసీసీ చీఫ్ రేవంత్, జానారెడ్డి, ఉత్తమ్, భట్టి, మధు యాష్కీ, కాంగ్రెస్ ముఖ్యనాయకులు హాజరు కానున్నారు. గురువారం మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలతో సన్నాహక సమావేశం జరిగింది. మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్..మల్లురవిలు హాజరయ్యారు. ఆర్ దామోదర్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం భారీ బహిరంగ సభ జరుగనుంది. మునుగోడు క్యాడర్ ను కాపాడుకొనే ప్రయత్నంలో నేతలున్నారు. సిట్టింగ్ సీటును దక్కించుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు.

SHARE