ఎస్సై పరీక్ష సరిగ్గా రాయలేదని యువకుడు ఆత్మహత్య..నాల్గు నెలల క్రితమే పెళ్లి

ఎస్సై పరీక్ష సరిగ్గా రాయలేదని 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. నాల్గు నెలల క్రితం ఈ యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడం గమర్హం.

వివరాల్లోకి వెళ్తే..

కల్లూరు మండలం తాళ్లూరి వెంకటాపురం గ్రామానికి చెందిన అరిగెల రాజప్రకాష్‌(24) నాలుగు నెలల క్రితం కవిత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన వీరిద్దరు ఖమ్మం బుర్హాన్‌పురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఎస్సై ఉద్యోగానికి సిద్ధమయ్యారు. రీసెంట్ గా వీరిద్దరూ ఎస్సై రాతపరీక్ష రాయగా కీ చూసుకుంటూ తక్కువ మార్కులు వస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో రాజప్రకాష్‌ తీవ్ర మనస్తాపానికి గురై ఇక బతకడం వృథా అని ఆవేదన వ్యక్తం చేస్తుండడం తో., కవిత మరోమారు ప్రయత్నం చేయొచ్చని సర్దిచెప్పింది. కానీ ప్రేమ వివాహం కావడం, ఇద్దరికీ ఉద్యోగాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాజప్రకాష్‌ ఆవేదన చెందాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కవిత కేకలు వేయడంతో స్థానికులు వచ్చి చూసే సరికే మృతి చెందాడు. పెళ్ళై నాలుగు నెలలకే భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కన్నీరును ఆపడం ఎవరి వల్ల కావడం లేదు.

SHARE