తీన్మార్ స్టెప్స్ వేసిన మంత్రి మల్లారెడ్డి..

టిఆర్ఎస్ మునుగోడు సభ కు వెళ్తూ టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి తీన్మార్ స్టెప్స్ తో అదరగొట్టారు. మునుగోడు లో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ప్రజాదీవెన సభ ఏర్పటు చేసింది. ఈ సభ కు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు నేతలంతా తరలివెళ్లారు. దాదాపు నాల్గు వేల వాహనాలతో భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి ఉప్పల్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వచ్చారు.

టీఆర్ఎస్ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ టీఆర్ఎస్ నాయకులు వస్తుంటూ మల్లారెడ్డి కూడా వాళ్లతో పాటే నడుచుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ పాటలు పెట్టడంతో మల్లారెడ్డి కూడా పాటలకు తగ్గట్టు తీన్మార్ స్టెప్పులేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆ తర్వాత కాన్వాయ్‌తో ఆయన మునుగోడు పర్యటనకు బయల్దేరారు. ఆయనతో పాటు కార్యకర్తలు కూడా భారీ వాహనాలతో మునుగోడుకు పయనమయ్యారు. ప్రస్తుతం మల్లారెడ్డి డాన్స్ వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

SHARE