మాదాపూర్ లో కాల్పుల కలకలం

సోమవారం ఉదయం మాదాపూర్ లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. తాడ్‌బండ్‌లోని 250 గజాల స్థలం విషయంలో ఇస్మాయిల్, మహమ్మద్ ముజాయుద్దీన్ మధ్య గత కొద్దీ రోజులుగా వివాదం కొనసాగుతోంది. వీరిద్దరూ కూడా పాత నేరస్తులు. ఈ స్థలం వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ముజాహిద్దీన్‌ని మాదాపూర్ రావాలని ఇస్మాయిల్ ఆహ్వానించాడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ముజాహిద్దీన్‌కి అనుచరుడైన జిలానీ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే ముజాహిద్దీన్ కంట్రీ మేడ్ గన్‌తో ఇస్మాయిల్‌పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది. సమాచారం అందిన వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కాల్పులు జరిపిన దుండగుడి కోసం గాలిస్తున్నారు.

ఈ ఘటనపై బాలానగర్ డీసీపీ సందీప్‌రావు మాట్లాడుతూ.. మాదాపూర్ పీఎస్ పరిధిలోని నీరుస్ జంక్షన్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్‌పై జిలానీ వ్యక్తి కాల్పులు జరిపాడని తెలిపారు. ఇస్మాయిల్‌, ముజాహిద్దీన్ మధ్య భూవివాదం కొనసాగుతోందని, దీనిపై ఇద్దరూ మాట్లాడుతుండగా ముజాహిద్దీన్ అనుచరుడైన జిలానీ కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం కలుసుకున్న ఇస్మాయిల్, ముజాహిద్దీన్.. మాసబ్‌ ట్యాంక్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌లో పలు దఫాలుగా చర్చలు జరిపి చివరికి మాదాపూర్ చేరుకున్నారని డీసీపీ తెలిపారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఇద్దరి మధ్య చర్యల మొదలు కాగా.. తెల్లవారుజామున 4గంటల సమయంలో జిలానీ కాల్పులకు తెగబడ్డాడని వెల్లడించారు. కాల్పులకు తెగబడ్డ జిలానీపై గతంలో చాలా కేసులున్నాయని వెల్లడించారు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఇస్మాయిల్ ప్రాణాలు కోల్పోగా.. అతడి అనుచరుడు జహంగీర్ గాయపడ్డాడని తెలిపారు.

SHARE