మ‌తాల పేరిట జ‌రుగుతున్న గొడ‌వ‌ల‌పై కేటీఆర్ కామెంట్స్

గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల ఫై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. హైద‌రాబాద్‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ వ‌ర్సిటీలో శ‌నివారం ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మ‌తాల పేరు చెప్పుకుని కొట్టుకోమ‌ని ఏ దేవుడు చెప్పాడంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. నీళ్లు లేక కొంద‌రు, తిండి లేక చాలా మంది అల్లాడుతుంటే…వాటి ప‌రిష్కారం వ‌దిలేసి అన‌వ‌స‌ర విష‌యాల‌పై రాద్ధాంతం చేయ‌డం అవ‌స‌ర‌మా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

8 ఏళ్ల పాల‌న‌లో తెలంగాణ‌లో ఏం సాధించార‌ని విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయ‌న్న కేటీఆర్… ఈ 8 ఏళ్ల స్వ‌ల్ప కాలంలోనే నీటిపారుద‌ల రంగంలో తెలంగాణ దేశానికే ఓ న‌మూనాగా మారింద‌ని చెప్పారు. ఈ రంగంలో రాష్ట్రం ఉజ్వ‌ల స్థితికి చేరింద‌న్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా నీటి పారుద‌ల రంగంలో ఐఏఎస్‌ల‌కే పాఠాలు చెప్పే స్థాయికి ఎద‌గ‌టమే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న అన్నారు.

SHARE