మరికాసేపట్లో చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ ను ప్రారభించబోతున్న కేటీఆర్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు పెద్ద ఎత్తున ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ నగరంలో మొత్తం 15 ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ సిటీలో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, ఆర్‌ఓబీలు చేపట్టింది. ఇప్పటికే పలు ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి రాగ..ఈరోజు చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ కూడా అందుబాటులోకి రాబోతుంది.

మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం ఉదయం 11 గంటలకు చాంద్రాయణగుట్ట పైవంతెన ప్రారంభంకానుంది. ఈ వంతెన నిర్మాణంతో శంషాబాద్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ప్రయాణించడం మరింత సులభతరం కానుంది. అలాగే నల్గొండ, వరంగల్ వెళ్లడం కూడా మరింత సులభం అవుతుంది. మొత్తం రూ.45.79 కోట్లు పెట్టి ఈ వంతెన నిర్మించారు.

SHARE