కేటీఆర్‌ కాలికి గాయం..

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడ‌మ కాలికి గాయ‌మైంది. దీంతో మూడు వారాలపాటు ఆయనను రెస్ట్ తీసుకొమ్మని డాక్టర్స్ సూచించారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్​ ద్వారా తెలిపారు.ఈరోజు ప్రమాదవశాత్తూ ప్రగతిభవన్​లో జారిపడడంతో గాయమైనట్లు కేటీఆర్​ తెలిపారు. కాలు చీలమండ లిగ్మెంట్‌లో చిన్న చీలిక వచ్చినట్లు టెస్ట్ లో తేలింది. ఆస్పత్రిలో చికిత్స తర్వాత కేటీఆర్ ప్రగతిభవన్ చేరుకున్నారు. ఈ విశ్రాంతి సమయంలో ఓటీటీకి సంబంధించిన కార్యక్రమాలు, సినిమాల గురించి తనకు సలహాలు ఇవ్వాలని అభిమానులను కేటీఆర్ కోరారు.

ఇదిలా ఉంటె రేపు కేటీఆర్ పుట్టిన రోజు. ఈ క్రమంలో ఆయన కాలికి గాయం కావడం పార్టీ శ్రేణులను , కార్యకర్తల్లో బాధకలిగించింది. ఇప్పటికే.. ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్న అభిమానులు, టిఆర్ఎస్ శ్రేణులకు.. మధ్యాహ్నం కేటీఆర్ చేసిన విజ్ఞప్తితో కొంత నిరాశలో ఉన్నారు.​ రాష్ట్రంలో భారీ వరదల కారణంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని.. వరదలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ఇక.. ఇప్పుడు కాలికి గాయం అనే విషయం తెలియటంతో మరింత నిరుత్సాహపడ్డారు. ఇదిలా ఉంటె కేటీఆర్ అడిగిన ఓటిటి సలహాకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిప్లయ్ ఇచ్చింది.

హలో కేటీఆర్.. మీరు కచ్చితంగా తెలుగులో వచ్చిన ది బెస్ట్ రివేంజ్ డ్రామా పరంపరను చూడండి..ఇప్పుడు హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోందంటూ కేటీఆర్‌కు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిప్లై ఇచ్చింది. మరి దీనికి కేటీఆర్ రియాక్ట్ అవుతాడా? లేదా? అన్నది చూడాలి.

SHARE