ఎమ్మెల్యే జగత్‌సింగ్‌ నేగి ఇంటిపై ఐటీ ..ఈడీ లేదా సీబీఐ దాడులు తప్పవు – కేటీఆర్

ఇటీవల కాలంలో బిజెపి సర్కార్ ఫై ఎవరు విమర్శలు చేస్తే వారి ఫై ఐటీ ..ఈడీ లేదా సీబీఐ దాడులు జరుపుతున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ గత కొద్దీ నెలలుగా కేంద్రం ఫై విరుచుకుపడుతుంది. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా కేంద్రాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ వస్తున్నారు. కేంద్రం ఫై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దాడులు జరపడం..ఆ తర్వాత వారిని తమ పార్టీలోకి ఆహ్వానించడం చేస్తున్నారని మండిపడుతూ వచ్చారు. తాజాగా మరోసారి అదే ప్రస్తావనను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసారు.

దేశాన్ని పరిపాలించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారంటూ హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో తూర్పారబట్టిన ఎమ్మెల్యే జగత్‌సింగ్‌ నేగి ఇంటిపై ఈడీ లేదా ఐటీ, సీబీఐ దాడులు తప్పవని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో జగత్‌సింగ్‌ చేసిన ప్రసంగం వీడియోను రెడ్కో చైర్మన్‌ వై సతీశ్‌రెడ్డి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. చాలా క్లుప్తంగా వాస్తవాలను వివరించిన ఆ ఎమ్మెల్యే ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ వినాలని ట్వీట్‌ చేశారు. అయితే ఆ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసేందుకు ఈడీ, లేదంటే ఐటీ, సీబీఐ ఇప్పటికే సిద్ధమై ఉంటాయంటూ బీజేపీ విధానాలపై వ్యంగ్యాస్త్రం సంధించారు.

Must watch speech 👇 Succint & factual 👍

I am sure ED, IT & CBI are on their way to the Hon’ble MLA’s home 😁 https://t.co/D5r6gGPiEe— KTR (@KTRTRS) July 27, 2022

SHARE