ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా లేదంటే ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న రాత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. తనను విమర్శించిన నేతలను పార్టీ నుంచి తొలగించాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను బుజ్జగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మునుగోడు ఉపఎన్నికపై ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ అయ్యారు. పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి,ఉత్తమ్,మధుయాష్కీ,జీవన్ రెడ్డి పలువురు నేతలు హాజరవ్వగా.. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు.తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు వ్యవహరిస్తున్నందునే తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉంటున్నానని వెంకట్​ రెడ్డి అన్నారు. ఈ తరుణంలో ఆయనతో మాట్లాడేందుకు అధిష్టానం రామన్నట్లు తెలుస్తుంది.

SHARE