చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్

తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోవడం ఫై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన చెరుకు సుధాకర్‌.. గురువారం కాంగ్రెస్ నేతలతో 4 గంటలకుపైగా సంప్రదింపులు జరిపారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

చెరుకు సుధాకర్ ను చేర్చుకోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ లో ఎలా చేర్చుకుంటారని రేవంత్ తీరుపై మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత మునుగోడుకు వెళ్తా అన్నారు. చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని.. ఇకపై ఆయన ముఖం కూడా చూడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

SHARE