ఈనెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో బిజెపి లో చేరనున్న రాజగోపాల్

మునుగోడు ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత రాజగోపాల్ ఈ నెల 21 న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో బిజెపి లో చేరబోతున్నారు. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్..బిజెపి లో చేరబోయేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. శుక్రవారం ఢిల్లీ లో బిజెపి నేత వివేక్‌తోపాటు ఆయన.. అమిత్‌ షాను కలిశారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో ఇచ్చిన రాజీనామాను ఈనెల 8న సభాపతిని కలిసి ఆమోదింపజేసుకుంటానని పేర్కొన్నారు.

భవిష్యత్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం సరైన నిర్ణయం తీసుకుంటారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం ఉన్నవారు కాంగ్రెస్‌ పార్టీలో ఉండరన్న ఆయన.. తప్పుడు వ్యక్తి చేతుల్లోకి పీసీసీ పదవి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలను రేవంత్‌రెడ్డి రుజువు చేయలేక పోయారని.. ఇప్పటికైనా రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. మునుగోడు ఉపఎన్నిక రాజగోపాల్‌రెడ్డి కోసం కాదని, తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పనికొచ్చే విధంగా మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

SHARE